Monday, November 26, 2012

అమ్మాయి మనసు .....

                                            అమ్మాయి మనసు ....    .more reality love and family stories
"""నమ్మకం అనే పదానికి చాల పవిత్రత ఉంది కాని నమక0 అనే మాటకే విలువను కోల్పోయేలా చేసే వాళ్ళని ఏమిచేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము""
   నా పేరు రజిత నాకు ఒక బాబు ...నేను విజయవాడ నుండి కర్నూల్ కి ట్రైన్ లో వెళ్తూ ఉండగా న చిన్ననాటి ఫ్రెండ్ శైలజ ట్రైన్ లో కనపడింది బాగున్నావా అని పలకరించాను..తన దగ్గరనుండి నేను హ బాగున్నాను అనే మాట వింటాను అనుకున్నాను కాని ఒక్కసారిగా కళ్ళవెంట కన్నీటితో నా మాటకి సమాధానము చెప్పింది .పక్కన వాళ్ళ తండ్రి ఉన్నాడు ఏమిచేయాలో తెలియని పరిస్థితులలో దిక్కుతోచని స్థితిలో దీనం గ మొహం పెట్టి బాగున్నవమ్మ అన్నాడు నాకు వాళ్ళని చూసాక నరకం ఎదురుగానే ఉందా అనిపించింది అంత బయంకరమైన బాధను చెప్పుకోవటానికి ఎవరు లేరు అన్నంత గ ఉన్నారు..
ఏమైంది శైలజ అని అడిగాను
         తను నాతో ఈవిదంగా తన బాధని పంచుకుంది ...నా ఇంటర్ చదువు ఐపోగానే మా ఉరేల్లిపోయాను అక్కడ నాన్న అమ్మ తో ఉంటూ అమ్మ కి ఆరోగ్యం బాగాలేక ఇంట్లో పనులు నేనే చూసుకుంటూ ఉన్నాను ఇంక చదువు ఆపేసాను ఆ టైం లోనే రాజు అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు చాల ప్రేమగా మాట్లాడేవాడు మా పక్క పోర్షన్ లోనే అద్దెకు దిగాడు చాల మంచిగా మాట్లాడేవాడు కొద్దిరోజుల్లోనే మా ఫ్యామిలీ అందరికి చాల దగ్గర అయ్యాడు ..కొద్దిరోజులు గడిచాక నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు నాకు కూడా తను మంచివాడే కదా తనలాంటి భర్త వస్తే బాగుండు అని పించింది నేను కూడా ప్రేమించాను ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదివేవాడు ..
రెండు సంవస్తారాలు ప్రేమించుకున్నాము తను ఫైనల్ ఇయర్ చదువుతున్న సంవత్షరం మా ఇంట్లో మా పెళ్లి గురించి అడగమని చెప్పాను తనని ...తను కూడా సరే అని ఒప్పుకున్నాడు ..తన కాలేజీ ఐపోయింది ఉరెళ్ళాడు ఉరెల్లి ఒక నెల లోపు వస్తాను మీ ఇంట్లో మాట్లాడి ఇంక పెల్లిచేసుకున్దాము  అన్నాడు నేను కూడా సరే అన్నాను

                              నెల దాటిపాయింది తను రాలేదు ఆరు నెలలు దాటిపాయింది ఇంక తను రాలేదు బయం వేసింది మోసం చేసాడేమో అని కంగారు పడ్డాను తరువాత తన ఫ్రెండ్స్ ని అడిగాను ..వాళ్ళు చెప్పిన మాట వినగానే నాకు ఇంక ఏమితోచలేదు  తను వెళ్ళిన 20 రోజులకే రోడ్ యాక్సిడెంట్  లో చనిపోయాడు  అని చెప్పారు ...
       నాకు ఏమిచేయాలో తెలియలేదు నేను ఒంటరిదాన్ని ఐపోయాను ఒకప్పుడు తనతో అనేద్దాన్ని నువ్వు లేకపోతే చచిపోతాను అని కాని చావంటే బయం వేసింది చచిపోవటానికి చాల దైర్యం కావాలనిపించింది బాధతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో నే నాకు ఇంట్లో వాళ్ళు పెల్లిచేసేసారు ..పెళ్లి అయ్యాక కొత్త జీవితం మొదలుపెట్టాను పెళ్లి ఐన 20రోజులు చాల హ్యాపీ గ గడిచిపోయాయి తనని చాల నమ్మే స్టేజి లో ఉన్నాను ప్రతి విషయం షేర్ చేసుకునే దానిని చిన్న చిన్న విషయాలనుండి ప్రతిది చెప్పేసాను ఒకరోజు మాటల మద్యలో నా ప్రేమ విషయం కూడా చెప్పేసాను నా జీవితానికి అదే ఆకరి రోజు ఆవుతుంది అని నమ్మలేకపోయాను ..
               ఆరోజు నుండి నా జీవితం వేరు ఐపాయింది బ్రతుకే కష్టం  ఐపాయింది నేను ఉన్నాను అంతే మా బర్తకి అన్నం చేసిపెట్టడానికే  ఉన్నాను అనేలా చేసాడు . మాట్లాడటం మానేసాడు ఇంక ప్రేమగా చూసుకోవటం మానేసాడు నరకం చూపిస్తున్నాడు. ఎలాగోలా బ్రతుకుత్న్నాను ఆ టైం లోనే హాస్పిటల్ కి వెల్ల వలసివచింది  తలనొప్పి వచెది వెళ్లి డాక్టర్ కి చూపించుకున్నాను అతను ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతావు అన్నాడు ఈ విషయం మా భర్తకి చెప్పాను మీ నాన్నకి cheppi   చూపించుకో నేను నీకు ఖర్చులు పెట్టలేను అన్నాడు..
                           నాన్నకి చెప్పాను ఉరికొచ్చి  మా భర్తని అడిగాడు మా నాన్నకి చేతితో సమాధానం చెప్పాడు ఇంక అంతే నాన్న ఏమి మాట్లాడలేదు నన్ను ఎలాగైనా బ్రతికిన్చుకుంటాను అని ఉరు తీసుకెళ్తున్నాడు తనని నమ్మటమే నా నేను చేసిన తప్పు అని ఏడ్చేసింది.
                 ఇది జరిగిన నెలరోజులకే వాళ్ళ నాన్న కనపడ్డాడు తనని అడిగితే తనని తీసుకెళ్ళిన వారానికే చనిపాయింది అని చెప్పాడు
                     ఆడవ్వాళ్ళు ప్రేమిస్తే ప్రాణాలు ఐన ఇస్తారు మరి ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోరు ...
అమ్మాయి అంటే వంట చేయతనికేనా  ఉన్నారు ..లవ్ స్తోర్య్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి అమ్మాయి కే న ఉండేది అబ్బాయిలకి  ఉండవా మీరు రోడ్ వెంట వెళ్ళే ప్రతి అమ్మాయి ని చూస్తారు కదా ఛాన్స్ ఇస్తే సినిమాకి కూడా తేసుకేల్తారు కదా మరి మిమల్ని ఏంచేయాలి ""కాని ఒక్కటి నిజం అమ్మాయి తప్పు చేయాలి అని అనుకుంటే ఆపటానికి ఆ దేవుడు దిగిరావాలి  దేవుడికి కూడా తెలియకుండా తప్పు చేయగలదు కాని ఆలోచిస్తుంది మనసు పంచాక ప్రాణం పోయిన తప్పు చేయదు అమ్మాయిని అమ్మాయిలా చూడకపోయిన పర్లేదు కాని మనిషి గా చూడండీ...
                                                                               మీ ...రజిత (కర్నూల్)More Reality Love and Family Storys


                         




Wednesday, November 21, 2012

మీకు బాధని కలిగించిన రోజు ఉందా ..?

హలో  ఫ్రెండ్స్ మన అందరికి ఎదో ఒక టైం లో బాధ ని కలిగించిన సంగటనలు ఉంటై కదా వాటిని అందరితో పంచుకోలేము కాని పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అందుకోసమే ఈ వెబ్సైటు మీ బాధని పంచుకోవటం కోసం మీరు చేయవలసింది మీ స్టొరీ ని తెలుగులో కాని ఇంగ్లీష్ లో కాని వ్రాసి ఈ మెయిల్ కి పంపండిwww.manabadiss.blogspot.com@gmail.com,pravee.prasha@gmail.com మీ స్టొరీ ని మీ రియాలిటీ స్టొరీ ని అందరితో షేర్ చేసుకోండి. అందరి కామెంట్స్ ని పొందండి

తప్పు చేశానా


                                   తప్పు చేశానా



నా పేరు వెంకట్ నా ప్రేమ అందరిలాగానే మొదలైంది ....నా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయి కాలేజీ నుండి ఇంటికి బయలుదేరి వస్తున్నాను.అందరి గర్ల్స్ లాగే ఒక అమ్మాయి ముందు సీట్ లో కూర్చుంది నేను అందరి బాయ్స్ లాగే అల్లరి చేస్తూ ఉన్నాము..చాల సేపటి తారావత ఒక అమ్మాయి లేచి మీకు పని పాట లేదా ఉరిక ఎందుకు అల్లరిచేస్తారు అని గట్టిగ అరచింది అందరు సైలెంట్ ఐపోయారు నేను కూడా సైలెంట్ ఐపోయాను.
        చూడటానికి చాల అందం గ ఉంది చాల చాల చాల బాగా నచ్చింది కాని బాగా కోపం ఎక్కువ
ఇంతలో నేను దిగవలసిన స్టేజి కూడా వచ్చింది మా స్టేజి దగ్గర నేను ఒక్కడినే దిగాను మా స్టేజి నుండి మా ఊరిలోకి వెళ్ళాలంటే 4 కి మీ నడవాలి బస్సు మల్లి స్టార్ట్ ఐ వేల్లిపాయింది కొంచం దూరం వెళ్లి ఆగింది నేను తిరిగి చూసాను ఒక అమ్మాయి అందులోనుండి దిగింది చూసాను తను ఎవరో కాదు బస్సు లో బాగా కోపం గ తిట్టింది కదా ఆ అమ్మాయి నాకు  చాల ఆనందం వేసింది కాని బయం కూడా వేసింది అమ్మో ఈ అమ్మాయి కి చాల కోపం ఎక్కువ కేర్ఫుల్ గ ఉండాలి అనిపించింది నేను ముందు నడుస్తున్నాను తను నావెనుక నడుస్తూ వస్తుంది పలకరించాలి మాట్లాడాలి అనిపించింది కాని బయం వేస్తుంది కొద్దిసేపు నడిచాను హలో అని వాయిస్ తిరిగి చూసాను తను పిలిచింది చెప్పండి అన్నాను మీ నేమ్ ఏంటి అని అడిగింది వెంకట్ అని చెప్పను ,మీ నేమ్ ఏమిటి అని అడిగాను రాధా అని చెప్పింది.
   మీది ఎక్కడ అని అడిగాను హైదరాబాద్ అని చెప్పింది ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాను మా బందువుల ఇంటికి వస్తున్నాను అని చెప్పింది సరే అని నడుస్తూ వెళ్తున్నాం ఎదురుగ ఫ్రెండ్స్ వస్తున్నారు నన్ను వాళ్ళతో బలవంతం గ క్రికెట్ కి తీసుకెళ్ళారు నాకు వెళ్ళాలని లేదు కాని వెళ్ళాను క్రికెట్ ఐపోయాక ఇంటికి వెళ్ళాను అమ్మ చెంబుతో వాటర్ ఇచింది కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాను పక్క రూమ్ లో నుండి అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. అమ్మని ఎవరు అని అడిగాను మీ అత్తమ్మ కూతురు వచ్చింది ర చిన్నప్పుడు నితో పాటు ఒక అమ్మాయి ఆదుకునేది కదా ఆ అమ్మాయి వచ్చింది అని చెప్పింది కాని నాకు మనసు  మైండ్ అంత నాతో పాటు వచ్చిన అమ్మాయి మీద నే ఉన్నాయ్ ఫ్రష్ అప్ అయ్యాను ఉరు మొత్తం వెతకాలి తను ఎక్కడ ఉన్న వెతికి ఐ లవ్ యు చెప్పాలి అని అనుకున్నాను ఉరు మొత్తం వెతికాను కాని ఆ అమ్మాయి కనపడలేదు బాగా బాధ అనిపించింది ఎందుకో తెలియదు చాల చాల బాగా నచ్చింది ఒక్కసారి కనిపిస్తే చాలు ఇంకా లైఫ్ లో విడిచిపెట్టను అనిపించింది.
    కాని మిస్ ఐంది కదా ఏమితోచటం లేదు ఒక్క 5 minits లోనే ఇంత  ప్రేమ పుడుతుంద  అనిపించింది  ఫ్రెండ్స్ కలిసారు ఈవెనింగ్ పార్టీ ర అని చెప్పారు నేను బాధ లో ఉన్నాను కదా ఓకే అనేసాను అదే బాధతో ఇంటికి వెళ్ళాను వెళ్లి పడుకున్నాను అలాగే నిద్రపోయాను 1 గంట తరువాత అమ్మ వచ్చి నిద్రలేపింది కళ్ళు తెరిచి చూసాను ఎదురుగ రాధా ఆ అమ్మాయి నా కాళ్ళ ఎదురుగానే ఉంది తను ఎవరో కాదు మా అత్తమ్మ కూతురే అని అప్పుడే తెలిసింది  అంతవరకు ఒక్కసారి చూస్తే చాలు ఇంకా వదలను అనిపించింది కాని అసలు  ఇప్పుడు తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలంటేనే బయం వేస్తుంది..కాని మాట్లాడాలి ఎదో ఒకటి మాట్లాడాలి అనిపించేది ఎలాగోలా బాగా క్లోజ్ గా అయ్యాం 10 డేస్ మా ఇంట్లోనే ఉన్నది మేము చాల క్లోజ్ అయ్యాము తరువాత తను వాళ్ళ ఉరేల్లింది నాకు ఏమితోచటం లేదు పిచి పటినట్లుగా మారిపోయాను కొద్దిరోజుల తరువాత నాకు షాక్ తను మా ఇంటికి కాల్ చేసింది ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను హలో అని లేడీ వాయిస్ తను ఒకే మాట మాట్లాడింది వెంకట్ నువ్వంటే నాకు చాల ఇష్టం నన్ను పెళ్ళిచేసుకో మా అమ్మ వాళ్ళు నాకు వేరే సంబంధం చూస్తున్నారు అని చెప్పింది.
             నాకు ఎద్చాలో నవ్వాలో తెలియట్లేదు నాది just డిగ్రీ ఉద్యోగం లేదు అసలు నాకు తనని ఇచి పెళ్లి  చేయటానికి వాళ్ళ పెద్దలు ఒప్పుకోరు అనిపించింది తరువాత నేనే ఫోన్ చేశాను తనకి రాధా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసాను నేను ఇంట్లోవాల్లకి బయపడి తనని వదులుకోలేదు నా డిగ్రీ తనకి సరిపొతుందా ఉద్యోగం లేదు నాకు తనని ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకొని ఏమిచేయగాలను అనిపించింది వదులుకున్నాను...
        అనుకున్నట్లు గానే ఇది జరిగిన 2నెలల తరువాత తనకి పెళ్లి ఐపోయింది.
               కొద్దిరోజులు గడిచాక వాళ్ళ భర్త తో కలిసి మా ఇంటికి వచ్చింది నాకు కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి
తప్పుచేసనేమో అనిపించింది అందరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని కష్టాలు పడుతున్నారు డబ్బు ఉద్యోగం లేక అనుకోని ఆరోజు ఆ నిర్ణయం తీసుకున్నాను.నేను తీసుకున్న నిర్ణయం తప్పా అని తననే అడగాలి అనిపించింది అడిగాను తను చెప్పిన సమాదానం ఇప్పటికే కాదు ఎప్పటికి మరచిపోలేను ""ప్రేమ ఉంటె చాలు రా అది ఏమైనా చేయిస్తుంది"""  ఈ మాట నాతో చెప్పి వాళ్ళ ఉరెల్లి పోయింది...

         ఈ జీవితం ఎలా ఉంటుందో  తెలుసా ... ప్రేమించే టైం లో డబ్బు ఉండదు డబ్బు ఉన్న టైం లో ప్రేమ దొరకదు

                                                                   
                                                                       వెంకట్ (విజయవాడ)